Murali Nayak: కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

- జమ్మూకశ్మీర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్
- ఈ నెల 13న కల్లి తండాకు వెళ్లనున్న జగన్
- ఇప్పటికే మురళి కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్
జమ్మూకశ్మీర్ లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. మురళి మృతిపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13న జగన్ కల్లి తండాకు వెళ్లనున్నారు. ఇప్పటికే మురళి కుటుంబ సభ్యులను జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి దైర్యం చెప్పారు.
మురళీ నాయక్ అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. నాసిక్ లో శిక్షణ పొంది అసోంలో పని చేశారు. పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ బలగాలను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన వీర మరణం పొందారు. మురళి మృతి పట్ల అన్ని పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.