Indian Railways: జమ్మూలో ఉద్రిక్తత.. మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

Jammu Tension Railways to Run 3 Special Trains

  • పాక్ కాల్పులు, దాడులతో జమ్మూలోని ప్రజల ఆందోళన
  • బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న జనం
  • రవాణా సదుపాయం కల్పించేందుకు ముందుకు వచ్చిన రైల్వే శాఖ

భారత్– పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ బలగాలు కాల్పులు జరపడం, దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. దాడులు మరింత తీవ్రం కావచ్చనే భయంతో జమ్మూ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది.

జమ్మూ ప్రజల ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జమ్మూ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జమ్మూ, ఉధంపూర్ ల నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Indian Railways
Jammu and Kashmir
India-Pakistan Tension
Jammu
Udhampur
Delhi
Special Trains
Border Tensions
Cross-border Firing
  • Loading...

More Telugu News