Pakistan: కుప్వారా, యూరిలను టార్గెట్ చేస్తున్న పాకిస్థాన్... దీటుగా స్పందిస్తున్న భారత సైన్యం

- చీకటి పడిన తర్వాత రెచ్చిపోతున్న పాక్
- క్షిపణులు, రాకెట్లను ప్రయోగిస్తున్న దాయాది దేశం
- హై అలర్ట్ లో సరిహద్దు ప్రాంతాలు
భారత్ పై పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, పంజాబ్ లను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్ లోని కుప్వారా, యూరి సెక్టార్ లపై క్షిపణులు, రాకెట్లను ప్రయోగిస్తోంది. ఒకే సమయంలో పలు క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. పాక్ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి. పాక్ ప్రయోగిస్తున్న క్షిపణులు, రాకెట్లను మధ్యలోనే అడ్డుకుంటున్నాయి. ఈ తీవ్ర పరిస్థితి దృష్ట్యా పాక్ పై భారత్ ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. సరిహద్దు ప్రాంతాలన్నీ హై అలర్ట్ లో ఉన్నాయి.