తెగబడుతున్న పాక్... జమ్ము, అక్నూర్ లో ఆర్మీ సైరన్.. వీడియో ఇదిగో
- ఈరోజు పాక్ లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో భారత్ దాడి
- పాక్ ప్రయోగిస్తున్న క్షిపణులు, రాకెట్లను కూల్చి వేస్తున్న మన బలగాలు
- చీకటి పడిన తర్వాత జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేసిన పాక్
ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని జమ్ము, అక్నూర్ లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
పాక్ దాడుల నేపథ్యంలో ఈ రాత్రి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. పాక్ లోని మరిన్ని కీలక ప్రాంతాలను మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు, ఆర్మీ ఎస్-400 వ్యవస్థలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. జమ్ము ఎయిర్ పోర్ట్ వద్ద బలగాలు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.