తెగబడుతున్న పాక్... జమ్ము, అక్నూర్ లో ఆర్మీ సైరన్.. వీడియో ఇదిగో

  • ఈరోజు పాక్ లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో భారత్ దాడి
  • పాక్ ప్రయోగిస్తున్న క్షిపణులు, రాకెట్లను కూల్చి వేస్తున్న మన బలగాలు
  • చీకటి పడిన తర్వాత జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేసిన పాక్
పరిస్థితి క్రమంగా మరింత తీవ్ర రూపం దాలుస్తున్నట్టు కనపడుతోంది. ఈ తెల్లవారుజాము నుంచి పాకిస్థాన్ లోని దాదాపు 15 నగరాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. మరోవైపు, భారత్ పై సరిహద్దుల నుంచి పాక్ మిస్సైళ్లు, రాకెట్లతో దాడి చేస్తోంది. వాటిని మన బలగాలు నిర్వీర్యం చేశాయి. కొన్ని అమృత్ సర్ సమీపంలో పడినట్టు సమాచారం. మరోవైపు, చీకటి పడటంతో పాక్ దాడిని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. 

ఈ నేపథ్యంలో మన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్ లోని జమ్ము, అక్నూర్ లలో సైరన్ మోగించింది. ఆర్మీ సైరన్ మోగించిందంటే... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. 

పాక్ దాడుల నేపథ్యంలో ఈ రాత్రి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. పాక్ లోని మరిన్ని కీలక ప్రాంతాలను మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు, ఆర్మీ ఎస్-400 వ్యవస్థలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. జమ్ము ఎయిర్ పోర్ట్ వద్ద బలగాలు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.


More Telugu News