Ajit Doval: ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ
--
పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ దాడులకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పలుమార్లు భేటీ అయ్యారు. పాకిస్థాన్ పై మెరుపుదాడుల తర్వాత తాజాగా గురువారం ఉదయం ఈ ఇరువురూ మరోమారు సమావేశమయ్యారు. ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన ధోవల్.. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులపై ధోవల్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.