వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే మిస్సైల్ మన దగ్గరుంది: నారా లోకేశ్
- పాకిస్థాన్ గీత దాటిందన్న నారా లోకేశ్
- చాలా పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్య
- వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే మన మిస్సైల్ మోదీ అన్న లోకేశ్
"పాకిస్థాన్ గీత దాటింది. అమాయకులను చంపింది. చాలా పెద్ద తప్పు చేసింది. ఒక పాకిస్థాన్ కాదు... వంద పాకిస్థాన్ లు వచ్చినా భారతదేశంపై మొలచిన గడ్డి కూడా పీకలేరు. వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉంది. ఆ మిస్సైల్ ఏంటో తెలుసా? 'నమో'. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు" అని లోకేశ్ భావేద్వేగంతో మాట్లాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు.