సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై తొలిసారిగా మాట్లాడిన ప్రధాని మోదీ
- మన దేశ జలాలు మన హక్కు అన్న ప్రధాని మోదీ
- ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని స్పష్టీకరణ
- భారత్ నీళ్లు ఇప్పటి వరకూ బయటకు వెళ్లాయని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఇక నుంచి భారత్‌కు చెందిన జలాలు దేశ ప్రయోజనాలకే వినియోగించబడతాయని మోదీ పేర్కొన్నారు.
భారతీయ జలాలు ఇప్పటివరకు వెలుపలికి వెళ్లాయని, ఇకపై అది జరగదని మోదీ అన్నారు. మన జలాలు - మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన జలాలు ఇకపై మన అవసరాలకే వినియోగిస్తామని ఆయన అన్నారు.
చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు.