Parannu Parannu Parannu Chellan: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్!

- మలయాళం నుంచి రొమాంటిక్ థ్రిల్లర్
- లవర్స్ చుట్టూ తిరిగే కథ
- మనోరమా మ్యాక్స్ లో అందుబాటులోకి
- ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్
మలయాళం నుంచి ఇప్పుడు మరో రొమాంటిక్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమానే 'పరన్ను పరన్ను పరన్ను చెల్లన్'. టైటిల్ కాస్త పొడవుగా అనిపిస్తుంది గానీ, మలయాళంలో ఓ ఫీల్ తో కూడిన సూపర్ హిట్ సాంగ్ లోని వాక్యం ఇది. విష్ణు రాజన్ రాసిన ఈ కథను జిష్ణు హరీంద్రవర్మ తన దర్శకత్వంలో తెరకెక్కించాడు.
ఈ ఏడాది జనవరిలో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. జాయ్ జినిత్ - రామ్ నాథ్ సంగీతం, మధు అంబట్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఉన్నీలాల్ .. సిద్ధార్థ్ భరతన్ .. ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కథ విషయానికి వస్తే, సంధ్య - బిజూ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అబ్బాయి కులం వేరే కావడం వలన, ఆమె ఇంట్లోవారు ఒప్పుకోరు. వాళ్ల కారణంగా తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా, సంధ్యను తీసుకుని ఊరొదిలి వెళ్లిపోవాని అనుకుంటాడు? ఆ నిర్ణయం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అనేది కథ