సన్ రైజర్స్ కు డూ ఆర్ డై మ్యాచ్... ఓడితే ఇంటికే!

  • ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
  • ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

సొంత మైదానం అనుకూలతతో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్ కు ఇది చావో రేవో మ్యాచ్. ఎందుకంటే  ఈ మ్యాచ్ లో ఓడిపోతే సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 3 విజయాలతో 9వ స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతు కాగా, ఇవాళ్టి మ్యాచ్ లో గెలిస్తే, ఏ మూలో కాస్తంత చాన్స్ ఉంటుంది.

మరోవైపు, అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టు మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్తు అవకాశాలు మెరుగవుతాయి.


More Telugu News