రాజ‌స్థాన్‌లో మేనల్లుడికి రూ.21.11 కోట్ల పుట్టింటి కట్నం!

  • రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • మేన‌ల్లుడికి రూ. 21.11కోట్ల ఆస్తిని కానుక‌గా ఇచ్చిన న‌లుగురు సోద‌రులు
  • క‌ట్నంగా ఇచ్చిన వాటిలో కేజీ బంగారం, 15 కేజీల వెండి, రూ. 1.51 కోట్ల న‌గ‌దు
రాజ‌స్థాన్‌కు చెందిన న‌లుగురు సోద‌రులు త‌మ చెల్లెలి కుమారుడి వివాహంలో ఏకంగా రూ. 21 కోట్లు పుట్టింటి క‌ట్నం (మాయ్రా)గా ఇచ్చి వార్త‌ల్లో నిలిచారు. రూ. 21కోట్ల ఆస్తిని కానుక‌గా ఇచ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లా దేహ్ నివాసి జగ్వీర్ ఛబా, కమల దంప‌తుల‌ కుమారుడు శ్రేయాన్ష్ కు ఝడేలి గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ పొట్లియా, రామచంద్ర పొట్లియా, సురేష్ పొట్లియా, డాక్టర్ కరణ్ రూ. 21 కోట్ల 11 వేలు కట్నంగా ఇచ్చారు. వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తున్న‌ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఈ పుట్టింటి కట్నంలో ఏమున్నాయంటే..!
  • ఒక కిలో బంగారం 
  • 15 కిలోల వెండి 
  • 131 ఎక‌రాల భూమి
  • ఒక పెట్రోల్ పంపు
  • అజ్మీర్‌లో ప్లాట్ 
  • రూ.1.51 కోట్ల నగదు 
  • దేహ్ గ్రామంలోని 500 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక వెండి నాణెం 
  • విలువైన వాహనాలు, దుస్తులు మొదలైనవి కలిపి రూ. 21 కోట్ల 11 వేలు 


More Telugu News