India-US Trade Deal: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు... లాభాల్లో ముగిసిన మార్కెట్లు

India US Trade Deal Hopes Boost Indian Market
  • 294 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 114 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా లాభపడ్డ అదానీ పోర్ట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లను లాభాల దిశగా నడిపించింది. భారత్, అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. 

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294 పాయింట్లు లాభపడి 80,796కి పెరిగింది. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 84.27గా కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
అదానీ పోర్ట్స్ (6.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.11%), ఐటీసీ (1.62%), టాటా మోటార్స్ (1.50%).

టాప్ లూజర్స్
కోటక్ బ్యాంక్ (-4.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.26%), టైటాన్ (-0.73%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.65%), యాక్సిస్ బ్యాంక్ (-0.64%).
India-US Trade Deal
Indian Stock Market
Sensex
Nifty
BSE
NSE
Adani Ports
Tata Motors
Foreign Investment
Rupee

More Telugu News