YS Jagan: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారు: జగన్

YS Jagan Blames AP Government for Farmer Losses Due to Unseasonal Rains
  • వర్షాలపై సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్న మాజీ సీఎం
  • అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించాలని పార్టీ నేతలకు సూచన
  • రైతులకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చేతికి వచ్చిన పంట నీటిపాలైందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పండ్ల తోటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారని మండిపడ్డారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని, రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు.

ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్‌లో వాతావరణం అనుకూలించక అంతంత మాత్రంగానే దిగుబడి రాగా.. గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోయారని, ఇప్పుడు చేతికి వచ్చిన పంట నీటిపాలవడంతో నష్టాల్లో కూరుకుపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలతో జగన్ తాడేపల్లి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలని పార్టీ నేతలకు సూచించారు. పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ నిర్ణయించారు.
YS Jagan
Andhra Pradesh farmers
unseasonal rains
crop damage
government negligence
farmer distress
YCP
crop loss compensation
untimely rains
Andhra Pradesh agriculture

More Telugu News