బాలీవుడ్‌లో క‌ల‌క‌లం.. ప్ర‌ముఖ‌ న‌టుడిపై అత్యాచారం కేసు న‌మోదు

  • బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌పై రేప్‌ కేసు న‌మోదు
  • సినిమాల్లో అవ‌కాశాల పేరిట‌ తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు
  • బీఎన్ఎస్‌ సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసుల వెల్ల‌డి
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ పై ఆదివారం రేప్‌ కేసు నమోదైంది. సినీ పరిశ్రమలోకి రావ‌డానికి సహాయం చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేర‌కు ఆయ‌న‌పై అత్యాచారం కేసు న‌మోదు చేసిన‌ట్లు ముంబ‌యి పోలీసులు తెలిపారు. 

30 ఏళ్ల మహిళ ఇటీవల ఖాన్ త‌న‌ను సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిందని చార్కోప్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. దీంతో అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశామ‌ని, దర్యాప్తు జరుగుతోందని అధికారి వెల్ల‌డించారు.

అంతకుముందు అజాబ్ ఖాన్ హోస్ట్‌గా చేసే ఉల్లు యాప్‌లో ప్రసారమ‌య్యే వెబ్ షో 'హౌస్ అరెస్ట్'లో అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో అత‌నితో పాటు ప‌లువురిపై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఒక కేసు న‌మోదైంది. ఇప్పుడు మ‌హిళ ఫిర్యాదుతో అజాజ్‌పై రేప్ కేసు న‌మోదు కావ‌డం ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌కలం రేపుతోంది. 


More Telugu News