ముమైత్ ఖాన్ కు ఏమైంది... ఆమె మాటల్లోనే...!

Mumtaz Khans Shocking Health Revelation
  • ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కాలు స్లిప్ అయి పడితే బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిన్నాయన్న ముమైత్ ఖాన్
  • ఏడేళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడి
  • ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఒక టీవీ షో చేస్తూ, కొత్త బిజినెస్ మొదలు పెట్టానన్న ముమైత్ ఖాన్
సినీ అభిమానులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'ఇప్పటికింకా నా వయసు పదహారేళ్లే' అనే పాటతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్న ముమైత్ ఖాన్ దాదాపు ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోని అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినా, నటిగా పలు చిత్రాల్లో మెప్పించినా ఆమెకు మాత్రం 'ఇప్పటికింకా నా వయసు' ఐటమ్ సాంగ్‌తోనే మంచి పాప్యులారిటీ వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

తాజాగా తేజస్వి మదివాడ హోస్ట్ చేస్తున్న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అయ్యే 'కాకమ్మ కథలు' అనే టాక్ షోకి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి హాజరైన సందర్భంలో తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ముమైత్ ఖాన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కాలు స్లిప్ అయి కింద పడ్డానని, దాంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఆ సమయంలో సర్జరీ అయింది. దాదాపు 15 రోజులు కోమాలోనే ఉన్నాను. కొంత మెమరీ లాస్ అయింది అని చెప్పింది. 

ప్రస్తుతం తన బ్రెయిన్‌లో 9 వైర్స్ ఉన్నాయని తెలిపింది. సర్జరీ అయిన మూడు నెలలకే సూపర్ షో చేయడానికి వెళ్లానన్నారు. పెద్ద సౌండ్ వచ్చినా తట్టుకోలేనని అలాంటిది స్టంట్స్ చేశానని అయితే మరుసటి రోజు పొద్దున్నే తాను లేవలేకపోవడంతో అందరూ కంగారు పడి ఆసుపత్రికి తీసుకువెళ్లారన్నారు.

ఆ సమయంలో సర్జరీ చేసిన డాక్టర్ ఏడేళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెప్పారన్నారు. తాను పని చేయకపోతే ఎలా బతకాలని అనుకున్నాను, కానీ తప్పలేదన్నారు. మందులు వాడటం వల్ల చాలా లావు అయ్యాను. ఫేస్ పాడైపోయింది. 

ఈ ఇండస్ట్రీలో ఫేస్, ఫిట్‌నెస్ ముఖ్యం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నా బాడీ మీద ఫోకస్ పెట్టి గతంలో ఉన్నట్లు రెడీ అయి తిరిగి వచ్చానన్నారు. ఇప్పుడు ఒక టీవీ షో చేస్తున్నానని, కొత్త బిజినెస్ మొదలు పెట్టానంటూ ఏడేళ్ల తను పడ్డ కష్టాన్ని ముమైత్ ఖాన్ పంచుకున్నారు. 
Go Back to Shorts
Mumtaz Khan
health issues
brain surgery
coma
item song
Telugu actress
Kakamma Kathalu
Aaha
Shekhar Master
Tejaswi Madiwada

More Telugu News