Uttam Kumar Reddy: గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణకు చేసిన అన్యాయం స్పష్టంగా కనిపిస్తోంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy Accuses Previous Govt of Injustice to South Telangana

  • మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష
  • ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పూర్తి, కందమల్ల పునఃప్రారంభంపై హామీ
  • గత ప్రభుత్వం కాళేశ్వరంపైనే దృష్టి పెట్టిందన్న ఉత్తమ్
  • దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించారని విమర్శ

ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగ మార్గం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేస్తామని, నిలిచిపోయిన కందమల్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే అధికంగా దృష్టి సారించిందని, దీనివల్ల దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎస్సెల్బీసీ, దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగం కోసం ప్రత్యేకంగా రూ.23 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణలోని ఇతర జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

Uttam Kumar Reddy
Telangana Irrigation Projects
SLBC Project
Kandamal Project
South Telangana
Palమూరు-Rangareddy Project
Kalwakurthy Project
Nettempadu Project
Bhima Project
Congress Government
Irrigation Budget
  • Loading...

More Telugu News