Anil Kumar Yadav: మైనింగ్ కేసులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందే: మాజీ మంత్రి అనిల్ కుమార్

- నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఇటీవల కేసులు నమోదు
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారన్న అనిల్
- జిల్లాలో జరుగుతున్న అక్రమమైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్
నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకోలేరన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్‌పై తమపై బురద చల్లుతున్నారని, తాము అక్రమ మైనింగ్ చేయలేదని, అంతా దేవుడే చూసుకుంటాడని ఆయన తెలిపారు.
అయితే, ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ఉపాధిలేక వందలాది మంది రోడ్డున పడ్డారని మాజీ మంత్రి ఆరోపించారు.