టీడీపీ మహానాడు నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన నేతలు
- ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు నిర్వహణ
- మహానాడు నిర్వహణకు సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములు ఎంపిక
- ఈ నెల 7న మహానాడు పనులకు భూమి పూజ
సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో ఈ బృందం ఎంపిక చేసింది. అక్కడ మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ద్వారా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 7న మహానాడు పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు.