Pakistan Ranger: భారత భద్రతా బలగాల అదుపులో పాకిస్థాన్ రేంజర్!

Pakistan Ranger Apprehended by Indian Security Forces
  • రాజస్థాన్ లో భారత్ – పాకిస్థాన్ సరిహద్దు వద్ద భారత జవాన్లపై దుర్భాషలాడిన పాక్ జవాన్
  • పాక్ జవానును అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
  • పది రోజులకుపైగా పాక్ చెరలోనే ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు
రాజస్థాన్‌లో భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాక్ ఆర్మీ రేంజర్ ఒకరు బీఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా భారత సరిహద్దు గార్డులను, పోలీసులను కనపడగానే  దుర్భాషలాడాడు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పాక్ సైనికుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలియడంతో పాకిస్థాన్ సైనికుల్లో అలజడి నెలకొంది. సరిహద్దు గార్డుల ఫ్లాగ్ మీటింగ్ జరపాలని పట్టుబట్టింది. పాక్ సైనికుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే బీఎస్ఎఫ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరోపక్క పది రోజులకు పైగా భారత జవాను పూర్ణం సాహు పాక్ అదుపులో ఉన్నాడు. పది రోజుల క్రితం పొరబాటున పొరుగు దేశం సరిహద్దులోకి ప్రవేశించినందుకు భారత జవాను పూర్ణం సాహును పాకిస్థాన్ సైనికులు అరెస్టు చేశారు. ఫ్లాగ్ మీటింగ్ జరిగినప్పటికీ పాకిస్థాన్ అతన్ని విడుదల చేయలేదు. దీంతో ఆ సైనికుడి కుటుంబం ఆందోళన చెందుతోంది.

భారత ప్రభుత్వం పాకిస్థాన్ చెరలో ఉన్న బీఎస్ఎఫ్ జవానును విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కలేదు. పది రోజులకు పైగా అతను వారి అదుపులోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక పాకిస్థాన్ జవానును బీఎస్ఎఫ్ అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామంతో భారత జవానును పాక్ చెర నుంచి విడిపించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. 
Pakistan Ranger
BSF
India-Pakistan Border
Rajasthan
Pulwama Attack
Prisoner Exchange
Border Security Force
Pakistan Army
Poonam Sah
Cross Border Infiltration

More Telugu News