వ్యక్తిగత కారణం కాదు.. డ్రగ్స్ వాడటం వల్లే నెల రోజులు ఐపీఎల్‌కు దూరం: రబాడ
- దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ నెల రోజుల ఐపీఎల్ కు దూరం
- నిషేధిత ఉత్ప్రేరకం వాడకం వల్లే సస్పెన్షన్
- స్వయంగా అంగీకరించి, క్షమాపణలు చెప్పిన రబాడ
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నెల రోజుల క్రితం ఆటకు దూరమవ్వడానికి గల కారణం వెల్లడైంది. తాను నిషేధిత ఉత్ప్రేరకం (రిక్రియేషనల్ డ్రగ్) సేవించినట్లు నిర్ధారణ కావడంతోనే స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని రబాడ స్వయంగా తెలిపాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (ఎస్ఏసీఏ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 3న రబాడ కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళాడు. 'ముఖ్యమైన వ్యక్తిగత కారణాల' వల్ల స్వదేశానికి వెళ్లినట్లు అప్పట్లో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పేర్కొంది. అయితే, తాజాగా రబాడ విడుదల చేసిన ప్రకటన అసలు విషయాన్ని స్పష్టం చేసింది.
"నేను నిషేధిత ఉత్ప్రేరకం సేవించినట్లు పరీక్షల్లో తేలింది. దీనివల్ల తాత్కాలిక నిషేధానికి గురయ్యాను. అందుకే దక్షిణాఫ్రికాకు తిరిగి రావాల్సి వచ్చింది" అని రబాడ పేర్కొన్నాడు. తాను చేసిన పనికి ఎంతో చింతిస్తున్నానని, తన వల్ల నిరాశ చెందిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నానని రబాడ ఆవేదన వ్యక్తం చేశాడు.
క్రికెట్ ఆడటం తనకు దక్కిన గౌరవమని, దానిని ఎప్పటికీ తక్కువగా చూడనని తెలిపాడు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి రబాడ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన తన భవిష్యత్తును నిర్దేశించదని, మరింత కష్టపడి, అంకితభావంతో ఆడతానని పేర్కొన్నాడు.