సీఎం రేవంత్ 42సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేంటి?: హ‌రీశ్‌రావు

  • 'ఎక్స్' వేదిక‌గా సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు
  • కేంద్రం ఉపాధి ప‌నిదినాల్లో రాష్ట్ర కోటాను స‌గానికిపైగా త‌గ్గించింద‌ని ఆగ్ర‌హం
  • ముఖ్య‌మంత్రి 42 సార్లు ఢిల్లీకి వెళ్లిన ప్ర‌యోజ‌నం లేదని మండిపాటు
  • విష‌యం తెలిసినా రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారంటూ ఫైర్‌
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం ఉపాధి ప‌నిదినాల్లో రాష్ట్ర కోటాను స‌గానికిపైగా త‌గ్గించింద‌ని, ముఖ్య‌మంత్రి 42 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేంటి అని హ‌రీశ్‌రావు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా విమ‌ర్శించారు. 

"2024-25లో తెలంగాణకు MGNREGS పనిదినాలను 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి 42 సార్లు వెళ్లినా ఉపాధి హామీ ప‌నిదినాలు స‌గానికి త‌గ్గాయి. విష‌యం తెలిసినా రాష్ట్రంలోని 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు 8 మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వెంట‌నే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనిదినాలను పెంచాలని, బకాయిల‌ను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. 


More Telugu News