Sensex: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ

Sensex Closes in Profits Nifty Remains Flat
  • ఆరంభ భారీ లాభాలు ఆవిరి
  • ఒకానొక సమయంలో 900 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
  • చివరకు 259 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒడిదుడుకుల్లో కొనసాగాయి. ఆరంభంలో భారీ లాభాల్లో కొనసాగినప్పటికీ... ఆ తర్వాత లాభాలను కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 900 పాయింట్లకు పైగా లాభపడింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టపోయాయి.

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 80,501 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప లాభంతో 24,346 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్ మారకం విలువతో పోలిస్తే మన కరెన్సీ రూ. 84.50గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
అదానీ పోర్ట్స్ (4.11%), బజాజ్ ఫైనాన్స్ (2.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.51%), మారుతి (1.21%).

టాప్ లూజర్స్
నెస్లే ఇండియా (-2.04%), ఎన్టీపీసీ (-1.61%), టైటాన్ (-1.09%),  కోటక్ బ్యాంక్ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.85%).
Sensex
Nifty
Indian Stock Market
Stock Market Update
BSE Sensex
Top Gainers
Top Losers
Adani Ports
Bajaj Finance
Nestle India

More Telugu News