రామానాయుడు స్టూడియో భూముల వ్య‌వ‌హారం.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..!

  
విశాఖ‌ప‌ట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్య‌వ‌హారంపై శుక్రవారం విచార‌ణ జ‌రిగింది. గ‌తంలో ఫిల్మ్‌సిటీ కోసం కేటాయించిన భూముల‌ను ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగించుకోవ‌చ్చ‌ని గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దో చెప్పాలంటూ ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీన్ని సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. 

ఈ క్ర‌మంలో తాజాగా విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఓకా ధ‌ర్మాస‌నం... పిటిష‌న్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించింది. ఈ సంద‌ర్భంగా మధ్యంతర ఉప‌శ‌మ‌నం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. అవ‌స‌రం అనుకుంటే ప్ర‌భుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్ర‌యించాల‌ని సూచించింది. మ‌రోవైపు పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకుంటామ‌ని సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ కోర‌గా... ధ‌ర్మాస‌నం అంగీక‌రించింది. 


More Telugu News