'వేవ్స్‌'లో రజనీకాంత్, బాలీవుడ్ స్టార్స్‌తో క‌లిసి చిరంజీవి సంద‌డి

   
ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో మొద‌టి ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంతరం మోదీ భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ ఉద్దేశించి ప్ర‌సంగించారు. 

ఈ మెగా ఈవెంట్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, డ్రీమ్‌గ‌ర్ల్ హేమ‌మాలిని, మ‌ల‌యాళ స్టార్ న‌టుడు మోహ‌న్‌లాల్ త‌దిత‌రులు సంద‌డి చేశారు. బుధ‌వార‌మే చిరంజీవి ఈ కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్ నుంచి ముంబ‌యి చేరుకున్న విష‌యం తెలిసిందే. 

కాగా, కేంద్ర సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్ నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్రం వేవ్స్‌కు నాంది ప‌లికింది. 



More Telugu News