మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
- ఆయన వైసీపీకి కాదు, రాబందుల పార్టీకి అధ్యక్షుడంటూ ఫైర్
- పకృతి విపత్తులపై రాజకీయాలు చేయడమేంటని ఆగ్రహం
- రాజధాని పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్న మంత్రి
వైసీపీ హయాంలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ఏంజరిగిందని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రాజధాని పునర్నిర్మాణం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు గౌరవించేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో రూ.1.63 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.