క‌న్న‌ప్ప టీమ్‌కి సారీ చెప్పిన‌ శ్రీవిష్ణు.. కార‌ణ‌మిదే!

    
క‌న్న‌ప్ప టీమ్‌కి టాలీవుడ్ యువ న‌టుడు శ్రీవిష్ణు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇటీవలే విడుదలైన త‌న కొత్త సినిమా సింగిల్ టీజర్ లో ప్రస్తుత ట్రెండ్ ని అనుసరిస్తూ శ్రీవిష్ణు చేసిన కొన్ని సంభాష‌ణ‌లు వివాదాస్పదం కావ‌డంతో టీమ్ స్పందించింది. ముఖ్యంగా కన్నప్పలోని శివయ్యా డైలాగును వాడటం, వీడియో చివర్లో మంచు కురిసిపోయిందంటూ పలికిన పదాలు విష్ణుని హర్ట్ చేసినట్టుగా ఉన్నాయ‌ని వార్తలు వచ్చాయి. దానికి శ్రీవిష్ణు వీడియో రూపంలో క్షమాపణ చెప్పారు. 

తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, కానీ కన్నప్ప టీమ్ హ‌ర్ట్ అయింద‌ని తెలిసి మీ ముందుకు వచ్చామన్నారు. ఏవైతే ఇబ్బంది కలిగించాయో ఆ సీన్ల‌ను తొల‌గించిన‌ట్లు చెప్పారు. అలాగే సినిమాలో కూడా వాటిని తీసేయ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పి, ఈ వివాదానికి శ్రీవిష్ణు శుభం పలికారు. ప్ర‌ధానంగా ఈ చిత్రంలో సోష‌ల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్‌, వేరే హీరోల చిత్రాల్లోని ప‌లు సీన్స్‌ను రిఫ‌రెన్స్‌గా తీసుకున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా హీరో వెల్ల‌డించారు. ఎవ‌రికైనా ఇబ్బంది క‌లిగించి ఉంటే త‌మ‌ను క్షమించాల‌ని కోరారు. ఇక‌పై ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌న్నారు. 


More Telugu News