నాని 'హిట్ 3' సినిమా టికెట్ ధరల పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3'
- రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
- మూవీ టికెట్ ధరల పెంపు.. ఏప్రీ ప్రభుత్వం ఉత్తర్వులు
- సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50
- మల్టీప్లెక్సుల్లో రూ. 75 పెంచుకునేందుకు అనుమతి
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 50 (జీఎస్‌టీతో కలిపి), మల్టీప్లెక్సుల్లో రూ. 75 (జీఎస్‌టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు వారం రోజుల పాటు అమలులో ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది.
ఇక, ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న హిట్ 3కు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 2.37 గంటల రన్‌టైమ్‌తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.