ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీ కన్ఫార్మ్
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'ఎన్టీఆర్31'
- మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల సంయుక్త నిర్మాణం
- వచ్చే ఏడాది జూన్ 25న మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 22 నుంచి తారక్ కూడా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విడుదల తేదీని ప్రకటించారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్తాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టర్ను పంచుకున్నారు. ఇక, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.