Visakhapatnam Pakistani Family: విశాఖలో పాక్ కుటుంబం.. పోలీస్ కమిషనర్‌ను కలిసి పంపవద్దని వేడుకోలు

Pakistani Family Seeks Help from Visakhapatnam Police
  • భర్త, పెద్ద కుమారుడికి పాక్ పౌరసత్వం
  • భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం
  • అనారోగ్యంతో బాధపడుతున్నపెద్ద కుమారుడు
  • చికిత్స కొనసాగుతుండటంతో వెనక్కి పంపవద్దని వినతి
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన భారత ప్రభుత్వం దేశంలోని పాక్ పౌరులను వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే వందలాదిమంది పాక్ జాతీయులు దేశ సరిహద్దు దాటారు. ఈ క్రమంలో దేశంలో ఇంకా ఉన్న పాకిస్థాన్ జాతీయుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరసత్వం కలిగి విశాఖపట్నంలో ఉంటున్న ఓ కుటుంబం నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చీని కలిసింది. తమను వెనక్కి పంపకుండా చూడాలని వేడుకుంది. 

ఈ కుటుంబంలోని మహిళ, చిన్న కుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉండగా భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీని కలిసిన కుటుంబం.. తమ సమస్యలు విన్నవించింది. పెద్ద కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడికి విశాఖలో చికిత్స చేయిస్తున్నామని తెలిపింది. దీర్ఘకాల వీసా కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నామని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. కాబట్టి తమను వెనక్కి పంపకుండా చూడాలని కోరారు. స్పందించిన సీపీ.. వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆ కుటుంబాన్ని పంపించారు.
Visakhapatnam Pakistani Family
Pakistani Family in India
Visakhapatnam Police Commissioner
Shankhabrata Bagchi
Deportation Plea
Pakistan Citizens India
India Pakistan Relations
Long Term Visa Application
Medical Treatment Visakhapatnam

More Telugu News