Punjab Kings: నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ... టాస్ అప్ డేట్ ఇదిగో!

Punjab Kings vs Kolkata Knight Riders Toss Update and Match Preview
  • కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో పంజాబ్... ఏడో స్థానంలో కేకేఆర్
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులోకి మ్యాక్స్ వెల్, ఒమర్జాయ్ తిరిగొచ్చారు. అటు, కేకేఆర్ టీమ్ లో మొయిన్ ఖాన్ స్థానంలో రోవ్ మాన్ పావెల్... రమణ్ దీప్ స్థానంలో చేతన్ సకారియా తుదిజట్టుకు ఎంపికయ్యారు. 

పాయింట్ల పట్టిక చూస్తే... పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ ల్లో 5 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Punjab Kings
Kolkata Knight Riders
IPL 2023
Cricket Match
Eden Gardens
Maxwell
Oman
Rowman Powell
Chetan Sakariya
Toss Update

More Telugu News