Sudeep Nyaupane: తాను నేపాలీ అని చెప్పే లోపే కాల్చేశారు!

Nepali Tourist Killed in Pahalgam Terrorist Attack
  • పహల్గామ్ ఉగ్రదాడి మృతుల్లో ఒకరు నేపాల్ జాతీయుడు
  • తాను హిందువునని చెప్పిన వెంటనే కాల్చేసిన ఉగ్రవాదులు
  • జాతీయతను చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయిన కుటుంబ సభ్యులు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ దాడిలో నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సుదీప్ న్యూపానే కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు అతడిని భారతీయ హిందువుగా పొరబడి కాల్చి చంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం తన జాతీయతను చెప్పే అవకాశం కూడా ఉగ్రవాదులు ఇవ్వలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేపాలీ అని చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని వారు కంటతడి పెట్టుకున్నారు.

జాతీయత చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు

పహల్గామ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో సుదీప్ మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు దాడి సమయంలో సుదీప్‌ను మతం గురించి ప్రశ్నించారు. తాను హిందువునని చెప్పిన వెంటనే కాల్చేచేశారు. అతను నేపాల్ పౌరుడినని వివరించే అవకాశం కూడా ఇవ్వకుండా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 

ఈ ఘటన జరిగినప్పుడు సుదీప్ తన తల్లి రీమా, సోదరి సుష్మా, బావ ఉజ్వల్ కఫ్లేలతో కలిసి పహల్గామ్‌లో పర్యటిస్తున్నాడు. విడాకులు తీసుకున్న తన తల్లికి కొంత ఉపశమనం కలిగించేందుకు ఏప్రిల్ 19న వారు కశ్మీర్ యాత్రకు వచ్చారు. "అతను విదేశీయుడినని చెప్పే అవకాశం కూడా దొరకలేదు. అతనికి దేనితోనూ సంబంధం లేదు" అని సుదీప్ చిన్నాన్న తేజులాల్ న్యూపానే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భారత ప్రభుత్వం నుంచి పరిహారం కోరినట్లు తెలుస్తోంది.

Sudeep Nyaupane
Nepal
Pahalgam
Terrorist Attack
Kashmir
India
Tourist Killing
Religious Misidentification
Family Grievances
Compensation Demand

More Telugu News