హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థాన్ జాతీయులు... ఈ నెల 27లోగా వెళ్లిపోవాలి: తెలంగాణ డీజీపీ
- నగరంలోని పాకిస్థాన్ వాళ్ల వీసాలు రద్దయ్యాయన్న డీజీపీ
- అటారీ బోర్డర్ 30 వరకే తెరిచి ఉంటుందన్న డీజీపీ
- మెడికల్ వీసాదారులకు 29 వరకే గడువు ఉందన్న డీజీపీ
ఈ నెల 30వ తేదీ తర్వాత దేశంలో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి పాకిస్థాన్ వీసాలు పనిచేయవని స్పష్టం చేశారు.
వైద్య వీసా కలిగిన వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉందని తెలియజేశారు. దీర్ఘకాలిక వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు నగరంలోని పాకిస్థాన్ జాతీయులకు డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.