నాని 'హిట్ 3' మూవీ... 13 ఏళ్ల లోపు పిల్లలకు నో ఎంట్రీ!
- మే 1న విడుదలవుతున్న నాని 'హిట్ 3'
- సినిమాలో భారీ రక్తపాతం, హింస
- 'ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హిట్ 3' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం వంటి అంశాలు మోతాదుకు మించి ఉన్నాయని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రానికి 'ఏ' (పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సినిమా వీక్షించడానికి అనుమతి ఉండదు.
'దసరా', 'సరిపోదా శనివారం' వంటి చిత్రాల తర్వాత నాని నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు, తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. నాని స్వయంగా ఈ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. 'హిట్' సిరీస్‌లో గత చిత్రాలు విజయవంతం కావడం, ఈ సినిమాలో నాని పాత్ర పూర్తి భిన్నంగా ఉండనుందన్న ప్రచారం జరుగుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.
అయితే, తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలతో వస్తున్న 'హిట్ 3' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో, వారి అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే.