Visakhapatnam Girl Death: విశాఖ చర్చిలో బాలిక అనుమానాస్పద మృతి

--
విశాఖపట్నంలోని జ్ఞానాపురం చర్చిలో ఒక బాలిక మరణించడం స్థానికంగా కలకలం రేపింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.