పాక్ హైకమిషన్ వద్ద కేక్ కలకలం.. వైరల్ గా మారిన వీడియో ఇదిగో!
--
ఇదే సమయంలో, పాకిస్థాన్ హైకమిషన్‌కు ఒక వ్యక్తి కేక్ బాక్స్‌తో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడి జరిగిన రెండు రోజులకే ఈ సంఘటన జరగడంతో వివాదం చెలరేగింది. విలేకరులు ప్రశ్నించినప్పటికీ, ఆ వ్యక్తి కేక్ ఎందుకు తీసుకెళ్తున్నాడో వెల్లడించలేదు. ఓవైపు పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకుంటే పాక్ హైకమిషన్ లో కేకుతో వేడుకలు జరుపుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.