హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం విజ‌యం

  
హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం అభ్య‌ర్థి మీర్జా రియాజ్ ఉల్‌ హ‌స‌న్ ఎఫెండీ విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు 63 ఓట్లు రాగా... బీజేపీ అభ్య‌ర్థి గౌత‌మ్ రావుకు 25 ఓట్లు వ‌చ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో మీర్జా హ‌స‌న్ గెలుపొంది. హైద‌రాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎం కైవ‌సం చేసుకుంది. 

ఇక, హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల త‌ర్వాత ఎన్నిక జ‌రిగింది. బీజేపీ అనూహ్యంగా అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డంతో ఈ ఎన్నిక‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 23న ఎన్నిక జ‌రిగింది. ఇక్క‌డ మొత్తం 112 మంది ఓట‌ర్లు ఉన్నారు. అత్య‌ధిక ఓట్లు ఎంఐఎంకు ఉండ‌గా... ఆ త‌ర్వాతి స్థానంలో బీజేపీ ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండ‌గా... ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు ల‌భించింది. 


More Telugu News