ఆర్సీబీతో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ అప్డేట్ ఇదిగో!

  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 
  • పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో బెంగళూరు... 8వ స్థానంలో రాజస్థాన్ 
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొంటున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఒక మార్పు చేసినట్టు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ స్థానంలో పేసర్ ఫజల్ హక్ ఫరూఖీని జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. మరోవైపు, తమ జట్టులో ఎలాంటి మార్పు లేదని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ వెల్లడించాడు. 

ఇరుజట్ల పాయింట్లు, స్టాండింగ్ లు చూస్తే... ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ ల్లో కేవలం 2 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

Rajasthan Royals
RCB vs RR
IPL 2023
Ryan Parag
Rajat Patidar
IPL Match
Cricket Match
Fazalhaq Farooqi
Mahesh Teekshana
Chinnaswamy Stadium

More Telugu News