ఆ ఇద్దరూ ఆదుకోకపోతే... సన్ రైజర్స్ కు ఈ మాత్రం స్కోరైనా వచ్చేది కాదు!

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా మరోసారి తేలిపోయింది. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పేలవంగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. అది కూడా మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్ ఆదుకోబట్టి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. వాళ్లిద్దరూ కూడా చేతులెత్తేసి ఉంటే, సన్ రైజర్స్ ఓ 100 లోపు స్కోరుకో పరిమితం అయ్యేదేమో! 

ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అత్యంత దయనీయ స్థితిలో నిలిచింది. ట్రావిస్ హెడ్ (0) డకౌట్ కాగా, అభిషేక్ శర్మ 8, ఇషాన్ కిషన్ 1, నితీశ్ కుమార్ రెడ్డి 2, అనికేత్ వర్మ 12 పరుగులు చేశారు. ఈ దశలో క్లాసెన్, అభినవ్ మనోహర్ జోడీ ఎదురుదాడికి దిగి స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. క్లాసెన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేయగా... అభినవ్ మనోహర్ 37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్ లో ముంబయి బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ వికెట్ల పండుగ చేసుకున్నారు. బౌల్ట్ కు 4, చహర్ కు 2 వికెట్లు లభించాయి. బుమ్రా 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు.

Sunrisers Hyderabad
Mumbai Indians
IPL 2023
Heinrich Klaasen
Abhinav Manohar
Trent Boult
Deepak Chahar
poor batting performance
cricket match
Uppal Stadium

More Telugu News