Sai Chaitanya: అకుంఠిత దీక్ష.. ఐదు సార్లు విఫలమైనా.. ఆరోసారి సివిల్స్ కొట్టిన తెలుగు తేజం

- నిరాశకు గురికాకుండా తన లక్ష్యాన్ని సాధించిన సాయి చైతన్య
- ఆరోసారి ప్రయత్నంలో సివిల్స్ లో 68వ ర్యాంక్
- పట్టుదల వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించిన చైతన్య
జీవితంలో ఏదైనా సాధించాలనే అకుంఠిత దీక్ష ఉంటే, కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుందనేదానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన సాయి చైతన్య ఇక ఉదాహరణ. జీవితంలో ఎంతో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకున్న ఎంతోమంది మధ్యలోనే నిరుత్సాహంతో వారి ప్రయాణాన్ని ఆపేస్తుంటారు. అతి తక్కువ మంది మాత్రమే నిరుత్సాహానికి గురి కాకుండా వారి లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి విజేతల్లో ఒకరు సాయి చైతన్య. సివిల్ సర్వీసెస్ లో చైతన్య చివరకు అద్భుతమైన ఫలితాన్ని సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. సివిల్స్ ఫలితాల్లో ఆయన 68వ ర్యాంక్ సాధించారు.
దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న చైతన్య కృషి ఆషామాషీ కాదు. ఐదు సార్లు ఆయన సివిల్స్ పరీక్షల్లో నిరాశను ఎదుర్కొన్నారు. అయినా, పట్టుదల వదలని విక్రమార్కుడిలా, డీలా పడకుండా, తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు ఆరో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 68వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీరే:
