పహల్గామ్ దాడికి సూత్రధారి పాక్ ఉగ్రవాదే!
- దాడి వెనక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జుట్ !
- గుర్తింపు కార్డులు అడిగి ముస్లిమేతరులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- ఘటనా స్థలంలో ఏకే-47 బుల్లెట్లు స్వాధీనం.. భద్రతా బలగాల గాలింపు
పహల్గామ్ దాడికి సంబంధించి అధికార వర్గాల కథనం ప్రకారం.. సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రవాదులు తొలుత పర్యాటకుల గుర్తింపు కార్డులు అడిగారు. ముస్లింలు, ముస్లిమేతరులను గుర్తించేందుకే ఇలా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత పురుషులను వేరు చేసి, వారిపై 5 నిమిషాల పాటు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌కు చెందిన బుల్లెట్లతో పాటు కవచాలను ఛేదించగల బుల్లెట్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమాయక పౌరులు, పర్యాటకులపై జరిగిన ఈ దాడిని భారత సైన్యం పిరికిపంద చర్యగా అభివర్ణించింది.