పోలవరం నిర్వాసితులకు అంత్యోదయ కార్డులు అందజేసిన మంత్రి నాదెండ్ల

  • పోలవరం ఆర్ అండ్  ఆర్ కాలనీలో మంత్రి నాదెండ్ల పర్యటన
  • నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • నిర్వాసితుల త్యాగాలను కూటమి ప్రభుత్వం మర్చిపోదని స్పష్టీకరణ 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పోలవరం  ప్రాజెక్ట్ నిర్మాణానికి తమ భూములు త్యాగంచేసిన 35 వేల మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. నిర్వాసితులకు  ఆహార భద్రతాకీ అంత్యోదయ అన్నా యోజన కార్డులు అందజేసి వారికి  ప్రతినెలా 35 కేజీల బియ్యన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు.

నిర్వాసితుల కుటుంబాలలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇందుకోసం ప్రత్యేక సర్వేని నిర్వహిస్తామన్నారు. పునరావాస కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యా, వైద్యం తదితర మౌలిక సదుపాయాలను ఆరు నెలలులోగా కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

గిరిజనులతో మంత్రి నాదెండ్ల ఆటా పాటా...

బర్రింకలపాడులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి గిరిజన ప్రజలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, సంగీతాలతో స్వాగతం పలికారు. వారి నాట్యానికి ముగ్దుడైన మంత్రి వారి వద్ద ఉన్న కొమ్ములు ధరించి వారితో కలిసి నృత్యం చేశారు  ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తదితరులు కూడా గిరిజనుల ఆనందంలో పాలుపంచుకున్నారు.


More Telugu News