Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ.. రిమాండ్ పొడిగింపు
- సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు
- వంశీకి మే 6 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఎస్సీ, ఎస్‌టీ కోర్టు
- ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వంశీ
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన రిమాండ్‌ను ఎస్సీ, ఎస్‌టీ కోర్టు మరోసారి పొడిగించింది. మే 6 వరకు వంశీ రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో నేటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు.
దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు ఎస్సీ, ఎస్‌టీ స్పెషల్ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.