Chandrababu Naidu: చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు... వైసీపీ నేత రాజీవ్ రెడ్డి అరెస్ట్

YCP Leader Rajeev Reddy Arrested for Offensive Comments Against Chandrababu Naidu
షార్ట్స్‌లో చూడండి
కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిని, యూట్యూబ్ చానళ్లలో నోటికొచ్చినట్టు మాట్లాడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించడంలేదు. సొంతపార్టీకి చెందినవారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటోంది. 

తాజాగా, సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకుటూరు రాజీవ్ రెడ్డిని పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. రాజీవ్ రెడ్డి చేజర్ల మండలం పాతపాడు గ్రామానికి చెందిన నేత. చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడినట్టు అతడిపై కేసు నమోదైంది. స్థానిక నేతల ఫిర్యాదుతో పోలీసులు రాజీవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Rajeev Reddy
YCP leader
Arrest
Social Media
Offensive Comments
Nellore District
Andhra Pradesh Politics
Cyber Crime
Political Controversy

More Telugu News