ర‌ష్మీకి స‌ర్జ‌రీ... అస‌లేం జ‌రిగిందో ఇన్‌స్టా ద్వారా తెలిపిన యాంక‌ర్‌!

   
యాంక‌ర్ ర‌ష్మీకి ఇటీవ‌ల‌ శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. దీంతో అస‌లు త‌న‌కు ఏం జ‌రిగింది, ప్ర‌స్తుతం త‌న ఆరోగ్య ప‌రిస్థితిని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె పోస్టు చేశారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో త‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన వైద్యులు, కుటుంబ‌స‌భ్యులకు ఆమె ధ‌న్య‌వాదాలు చెప్పారు. 

"ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో నాకెంతో అండ‌గా నిలిచిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సుమారు 5 రోజుల్లోనే నా శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం తొమ్మిదికి ప‌డిపోయింది. జ‌న‌వ‌రి నుంచి నాకు ఏం జ‌రుగుతుందో అర్థం లేదు. తీవ్ర‌మైన భుజం నొప్పి, అకాల ర‌క్త‌స్రావంతో ఇబ్బందిప‌డ్డాను. వైద్యుల‌ను సంప్ర‌దిస్తే ముందు దేనికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా తెలియ‌లేదు. 

మార్చి 29 నాటికి పూర్తిగా నీర‌సించిపోయా. వ‌ర్క్ ప‌ర‌మైన క‌మిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆసుప‌త్రిలో చేరా. ఏప్రిల్ 18న శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. మ‌రో 3 వారాల‌పాటు విశ్రాంతి తీసుకోవాలి" అని ఆమె త‌న ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు స‌ర్జ‌రీకి ముందు దిగిన ఫొటోల‌ను పంచుకున్నారు.     


More Telugu News