సీఎం చంద్ర‌బాబుకు వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

  • నేడు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు
  • ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న బ‌ర్త్ డే విషెస్ 
  • ‘ఎక్స్’ వేదికగా సీబీఎన్‌కు జ‌గ‌న్ జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు   
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సీబీఎన్‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అటు కేంద్ర‌మంత్రులు, మంత్రులు ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.  

తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా చంద్ర‌బాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 


More Telugu News