హ్యాపీ బర్త్ డే అండీ.. చంద్రబాబుకు భువనేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు
- నేడు చంద్రబాబు 75వ పుట్టిన రోజు
- మీకు తోడుగా ఉండటం గర్వంగా ఉందన్న భువనేశ్వరి
- ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరి విషెస్
నేడు వజ్రోత్సవ (75వ) పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.
‘‘మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో మీరు నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతిరోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’’ అని భువనేశ్వరి రాసుకొచ్చారు. కాగా, చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.