కాంగ్రెస్ పార్టీ అణుబాంబులాంటిది: మాజీ మంత్రి మల్లారెడ్డి
- కాంగ్రెస్ దృష్టి బీఆర్ఎస్ పై పడిందన్న మల్లారెడ్డి
- ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని వ్యాఖ్య
- జపాన్ సైనికుల మాదిరి మనం పోరాడాలని పిలుపు
కాంగ్రెస్ పార్టీ పాలన దారుణంగా ఉందని, ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని మల్లారెడ్డి చెప్పారు. అణుబాంబులాంటి కాంగ్రెస్ పై జపాన్ సైనికుల మాదిరి మనం పోరాటం చేయాలని అన్నారు. అప్పుడే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
పార్టీ కోసం ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో భవిష్యత్తులో వారికే పదవులు వస్తాయని తెలిపారు. ఈ సమావేశానికి వచ్చిన నేతలు భవిష్యత్తులో ఎంపీలు, మంత్రులు కావచ్చని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.