తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..!
- ఈ నెల 22న విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలితాలను విడుదల చేయనున్న మల్లు భట్టి విక్రమార్క
- ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఫలితాలు
22వ తేదీ ఉదయం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫలితాలు బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు.