Harish Rao: చిన్నారి మాట‌ల‌కు కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు

సిద్దిపేట‌లో విద్యార్థుల కోసం 'భ‌ద్రంగా ఉండాలి.. భ‌విష్య‌త్‌లో ఎద‌గాలి' అనే అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఓ చిన్నారి మాటల‌కు ఆయ‌న కంట‌త‌డి పెట్టారు. 

ఓ విద్యార్థిని మాట్లాడుతూ త‌న తండ్రి చిన్న‌ప్పుడే చ‌నిపోయాడ‌ని, త‌ల్లే త‌న‌ను క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తోంద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాట‌లు విన్న హ‌రీశ్‌రావుతో పాటు అక్క‌డున్న వారంతా భావోద్వేగానికి గుర‌య్యారు. బాలిక‌ను ఆత్మీయంగా ద‌గ్గ‌రికి తీసుకుని, వేదిక‌పై త‌న ప‌క్క‌న కూర్చోబెట్టుకుని ఆయ‌న‌ ఓదార్చారు. 

Harish Rao
BRS leader
emotional moment
student's speech
Siddipet
Telangana
child's story
political leader
emotional appeal
public event

More Telugu News