అన్నవరంలో బలవంతపు పెళ్లిని అడ్డుకున్న భక్తులు

--
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో వివాహ వేడుకను భక్తులు అడ్డుకున్నారు. పీటల మీద కూర్చున్న పెళ్లికూతురు ఏడుస్తుండడంతో భక్తులు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో బలవంతంగా పెళ్లిచేస్తున్నారని ఆ యువతి వాపోయింది. 

తన వయసు 22 సంవత్సరాలు కాగా, వరుడి వయసు 42 ఏళ్లు అని చెప్పింది. దీంతో భక్తులు వివాహాన్ని నిలిపివేసి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులను స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.


More Telugu News